జిలానీ ఇంట్లో ఇఫ్తార్ విందు
హాజరైన మంత్రి పొంగులేటి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలోని ఖిల్లా బజార్ లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుడు జిలానీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందును ప్రారంభించి ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రిని ముస్లిం మర్యాదలతో ఘనంగా సత్కరించారు.