ఉగాది పురస్కారానికి ఎంపికైన ఖమ్మం కవి బుక్కా సత్యనారాయణ

ఉగాది పురస్కారానికి ఎంపికైన ఖమ్మం కవి బుక్కా సత్యనారాయణ

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 23 న నిర్వహించనున్న విశ్వావసు ఉగాది పురస్కారాలు 2025 కు ఖమ్మం నగరానికి చెందిన కవి రచయిత సామాజిక సేవకులు బుక్కా సత్యనారాయణ ఎంపికయ్యారు.ఆయనకు సమాచారం అందింది. హైదరాబాద్ లోని ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో కృషి చేసిన వారిని గుర్తించి వారిని హైదరాబాద్ కి ఆహ్వానించి ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు సమాచారంలో తెలిపారు.ఈ క్రమంలో ఈ ఏడాదికి గాను ఖమ్మం నగరానికి చెందిన బుక్కా సత్యనారాయణ ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఆయనకు విశ్వావసు నామ తెలుగు సంవత్సర ఉగాది పురస్కారం 23 న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే వేడుకలో అందజేయన్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking