రాష్ట్ర విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ సర్కార్
-నిరాశ పరిచిన రాష్ట్ర బడ్జెట్
-విద్యా రంగానికి అరకొర నిధులు
-టీజేఎస్ నల్గొండ జిల్లా
అధ్యక్షులు, టిపిటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి పన్నాల గోపాల్ రెడ్డి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
రాష్ట్ర ప్రజలని ప్రైవేట్ విద్య వైపు నెడుతున్న విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మొత్తం బడ్జెట్ 3,04, 965 కోట్లు అందులోవిద్యా శాఖకు కేటాయించింది 23,108 కోట్లు(7.57%) మాత్రమేనని టీజేఎస్ నల్గొండ అధ్యక్షులు టిపిటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి పన్నాల గోపాల్ రెడ్డి ఆరోపించారు.గత బడ్జెట్ లో విద్యారంగానికి 21,292 కోట్లు(7.3%) కేటాయించగా
ఈ బడ్జెట్లో గత బడ్జెట్ కంటే 1,816 కోట్లు మాత్రమే అధికం. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు అంతంత మాత్రమే అన్నారు.ఇది అత్యంత విచారకరం. రాష్ట్ర విద్యారంగాన్ని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.