కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా డా. పీవీ నందకుమార్ రెడ్డి

*కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ విసిగా డా. పీవీ నందకుమార్ రెడ్డి*

వరంగల్, అక్షిత బ్యూరో:

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్ గా డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి బుధవారం నాడు అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి యూనివర్సిటీ సిబ్బందితో ముచ్చటించారు.

నూతన వీసీకి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్ ,జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ , అడ్మిషన్ కమిటీ మెంబెర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్ కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలిద్ ,సిబ్బంది అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking