ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన బిఆర్ఎస్ వార్డ్ ఇంచార్జి చింతల నాగేశ్వరరావు

ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన బిఆర్ఎస్ వార్డ్ ఇంచార్జి చింతల నాగేశ్వరరావు

కోదాడ, అక్షిత ప్రతినిధి :

ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురష్కరించుకొని కోదాడ పట్టణంలోని 25 వ వార్డ్ ముస్లిమ్ సోదరుల రంజాన్ పండుగకు కానుకగా బియ్యం నిత్యావసర సరుకులు 25 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చింతల నాగేశ్వరరావు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముస్లిం సోదరులకు ఏ సమస్యలు వచ్చినా అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని వారన్నారు. పవిత్ర రంజాన్ మాసంను ముస్లిమ్ సహోదరులు భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో జరుపుకొని, ఆ అల్లా ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో వార్డ్ పెద్దలు ఉప్పతల కోటేశ్వర రావు, ఓర్సు దుర్గా రావు,బత్తుల ఉపేందర్, తిరుమల కొండ వెంకటస్వామి, వార్డ్ యూత్ అధ్యక్షుడు వేముల కోటేష్, ముస్లిమ్ పెద్దలు లాల్ మహ్మద్, మహబూబ్ పాష, ఖాశీ, మల్స్సూర్ తదితరులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking