ఖమ్మంలో మైనార్టీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
–ముఖ్యఅతిథిగా హాజరైన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం నగర ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ హాజరైనారు.ఖమ్మం నగర మైనార్టీల ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ ఫంక్షన్ హల్ లో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ జావిద్ మక్కాయాత్రకు వెళ్తున్న సందర్భంలో వారికి ఘనంగా మైనార్టీలు సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మైనార్టీ నాయకుల చోటా బాబా ఖమ్మం నగర కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వరరావు లకావత్ సైదులు మైనార్టీ నాయకులు ఆవాజ్ గౌస్ అబ్బాస్ బేగ్ నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మైనార్టీ లు భారీగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు.