ముస్లిం మైనార్టీ ఖమ్మం రూరల్ మండల జెఏసి నూతన కమిటీ ఆవిర్భావం
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కేంద్రం కు అతి సమీపంలో ఏర్పాటైన ఎదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ముస్లిం మైనార్టీల అభివృద్ధి అభ్యున్నతి వారి మౌలిక సమస్యల పరిష్కారానికి నూతనంగా ముస్లిం మైనార్టీ రూరల్ మండల జేఏసీ ఆవిర్భవించింది. అధ్యక్షులుగా మహమ్మద్ గౌస్ పాషా కార్యదర్శిగా షేక్ హుస్సేన్ కోశాధికారిగా షేక్ ఖాసిం గౌరవ అధ్యక్షులుగా మోసిన్ గౌరవ సలహాదారులుగా షేక్ జబ్బర్ సహాయ కార్యదర్శిగా షేక్ మదార్ ఉపాధ్యక్షులుగా రశీద్ జఫర్ షేక్ గౌస్ (పోలేపల్లి) పొన్నెకల్లు అబ్దుల్ రహీమ్ తేల్దారుపల్లి ఇషాక్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన జేఏసీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల పక్షాన తమ జేఏసీ చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేస్తుందని ప్రకటించారు. ఆదివారం ఆవిర్భవించిన ఈ నూతన ముస్లిం మైనార్టీ రూరల్ మండల జెఏసి కార్యక్రమంలో సయ్యద్ సాదిక్ అలీ షేక్ నజిరుద్దీన్ అబూబకర్ మదార్ జానీ గౌస్ మౌలానా మీరా యాకూబ్ అలీ ఖలీల్ యాసీన్ రఫీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.