వేసవి దాహార్తిని  తీర్చేందుకు చలివేంద్రం 

వేసవి దాహార్తిని 

తీర్చేందుకు చలివేంద్రం 

మేడ్చల్, అక్షిత బ్యూరో :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గoలో జగద్గిరిగుట్ట నందు ఆర్జీకే కాలనీ చెందిన లానా ఆధ్వర్యంలో మానవసేవే మాధవ సేవ నమ్మకంతో ఉన్నదాంట్లో కొంత ఖర్చు పెట్టి వేసవి నందు ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయగా ఆకుల సతీష్ మరియు నల్ల జయశంకర్ గౌడ్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ విధంగా ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే ఉన్న లానా మరియు వారి మిత్రమండలి చందాలు వేసుకొని ప్రజలకి రోజు త్రాగునీరు మరియు మజ్జిగ అందించడానికి ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలందరూ వినియోగించుకోవాలి మరియు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన జగద్గిరిగుట్ట రాజీవ్ గాంధీ కాలనీ రానా వారి మిత్ర మండలి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు ఆర్జీకె ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking