ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

రామన్నపేట నుండి ఎన్నారం వరకు నూతన బీటీ రోడ్డును వేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య

రెండో రోజుకు చేరుకున్న సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర

రామన్నపేట అక్షిత ప్రతినిధి

గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కరించడంలో విఫలం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య అన్నారు. రామన్నపేట మండల సమగ్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంపై ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది.ఇస్కిళ్ల, కక్కిరేణి, రంగమ్మగూడెం, ఎన్నారం, కుంకుడుపాముల, తుర్కపల్లి గ్రామాల్లో సిపిఎం పాదయాత్ర బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా కక్కిరేణి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గ్రామాల్లో అనేక ప్రజా సమస్యలు పేరుకుపోయాయని ప్రజా సమస్యల పట్ల పాలకుల నిర్లక్ష్యం దీనికి కారణం అన్నారు. ఇస్కిళ్ల, కక్కిరేణి మధ్య బిటి రోడ్డును పరిశీలించి గత 7 ఏండ్ల కింద వేసిన బిటి రోడ్డు మొత్తం ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. రోడ్డు సరిగ్గా లేక బస్సులు కనీసం ఆటోలు లేని పరిస్థితి నెలకొన్నది.

దీని మూలంగా అనేక మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. కక్కిరేణి గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నాస్తిరకంగా నిర్మించడంతో మెట్లు కూలిపోయి ప్రమాదంగా మారడంతో సిబ్బంది వాటర్ పెట్టడానికి బయపడుతున్నారు. అసీఫ్ నహర్ కాల్వపై 2017లో రెండు కోట్లతో నిర్మించిన వంతెన పూర్తి అయినా ప్రారంభం కాలేదు. మంచినీటి సమస్యపై అధికార యంత్రాంగం ద్రుష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు, గన్నేబోయిన విజయభాస్కర్,వేముల సైదులు,బోడిగే రజిత, గొరిగే సోములు, మేడి గణేష్,కొమ్ము అంజమ్మ, శానగొండ రాము,పాదయాత్ర సమన్వయకర్తలు వనం ఉపేందర్, కల్లూరి నగేష్, నీల అయిలయ్య, మెట్టు శ్రవణ్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివకుమార్ ఈర్లపల్లి ముత్యాలు, పుట్టల ఉదయ్ కుమార్, పల్లె సత్యనారాయణ, జలపాల లక్ష్మణ్ ఇతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking