గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ధర్నా
వరంగల్, అక్షిత బ్యూరో:
సిపిఎం పార్టీ. గత కొన్ని సంవత్సరాల నుండి గ్రేటర్ వరంగల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు మౌలిక సదుపాయాల వసతులు కల్పించాలని సోమవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు,ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు,కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ అహ్మద్,ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు,బషీర్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నో ఏండ్లగా నిరుపేదలైన ప్రజలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారనీ ప్రభుత్వాలు మారిన వారికి ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు ఏ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గానీ ఇవ్వక కాలయాపన చేస్తున్నారని అందుకు గుడిసె వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టమని తెలిపారు గుడిసె వాసులకు హోల్డర్ నెంబర్ తీసేసి ఓనర్ షిప్ నెంబర్ ఇవ్వాలి వ్యక్తిగతంగా యజమాని పేరుతో ఇంటి పన్నులు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు లేక ఉన్న కాలనీలు ఎంహెచ్ నగర్ మెయిన్ రోడ్డు సమస్య పరిష్కరించాలి. మరియు ఏకశిలా నగర్,ఎన్ పిఅర్ నగర్, రఘునాథ్ నగర్,లో, ఓ,ఎస్,నగర్, కారల్ మార్క్స్ నగర్ లలో రోడ్డు డ్రైనేజీ మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో లింగయ్య, రవీందర్, కుమార్, యాకయ్య,పూలమ్మ,మార్తా, లచ్చమ్మ, సుజాత, శేఖర్, నగేష్, మనోహర్, సుకన్య, శారద, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్, విజయ, జహీద, సరిత తదితరులు పాల్గొన్నారు.