అంజయ్యకు ఘన నివాళులు

*సంఘ సేవకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య మృతి… పలువురి సంతాపం…*

జనగామ, అక్షిత ప్రతినిధి:

జనగామ ఏ. బి. వి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్, లయన్స్ క్లబ్ జనగామ చార్టర్ కార్యదర్శి, పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కాసం అంజయ్య (82) ఆదివారం ఉదయం గం. 8.30 ని. లకు మృతి చెందారు. కొద్దీ రోజులుగా అశ్వాస్తతో ఉన్న వీరు ఏప్రిల్ 6 ఉదయం హైదరాబాద్ లో ప్రయివేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వీరి పార్తివ దేహాన్ని 12 గం. ల వరకు జనగామ గీతా నగర్ లోని వారి స్వగృహం తీసుకువచ్చారు. వీరి మృతి వార్త తెలుసుకున్న లయన్స్ ప్రముఖులు పూర్వ ఇంటరనేషనల్ డైరెక్టర్ రుమాల్ల సునీల్ కుమార్, మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్లు ఎం. విద్యాసాగర్ రెడ్ది, తీగల మోహన్ రావు, స్థానికంగా ఉన్న పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు, పలువురు లయన్ నాయకులు పూల మాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.


1943 ఫిబ్రవరి 3 న జన్మించిన అంజయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా వాణిజ్య శాస్రంలో పట్టభద్రులయ్యారు. 1966 లో అసిస్టెంట్ లెక్చరర్ గా వరంగల్ చందా కాంతయ్య మెమోరియల్ కళాశాలలో అధ్యాపక వృత్తి నారంభించి, కళాశాల ప్రిన్సిపాల్ గా ఎదిగారు. అనంతర కాలంలో జనగాంలో ఏ బి వి డిగ్రీ కళాశాల ప్రారంభ కాలంలో జన్మ భూమి మమకారంతో కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి దాని ఉన్నతికి 2001 లో పదవీ విరమణ చేసే వరకూ ఎనలేని సేవలు చేశారు.
లయన్స్ అంతర్జాతీయ స్వచ్చాంద సేవా సంస్థ 1976 లో జనగామ లో స్థాపన జరిగిన సమయంలో లయన్స్ క్లబ్ జనగామ వ్యవస్థపాక కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి అనేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి 1989 లో జిల్లా గవర్నర్ పదవి నదిస్టించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లయనిజం వ్యాప్తికి శ్రీకారం చుట్టిన అంజయ్య మార్గదర్శనంలో అనేక క్లబ్ లు విస్తరించారు. హిందీ ప్రేమి మండలి అధ్యక్షునిగా
అవొపా సంస్థ అధ్యక్షునిగా ఆయా సంస్థల్లో నూ విశేష రీతిలో పని చేసి ఆవోపా సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. జనగామ పట్టణ ప్రముఖునిగా అన్ని వర్గాలతో మమేకమై ఉండే అంజయ్య మృతి తీరని లోటు అని పట్టణ ప్రముఖులు పలువురు విచారం వ్యక్తం చేశారు.
సాయంత్రం 4.30 గం. లకు అంజయ్య అంతిమ యాత్ర బయలుదేరి నెహ్రు పార్క్ వద్ద గల లయన్స్ హిందూ స్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు.
వృత్తిగా విద్యారంగంలో, ప్రవృతిగా లయన్స్ సంస్థ వేదికగా సేవా రంగంలో విశేషరీతిలో కృషి చేసిన అంజయ్య సేవా నిరతి, కార్యదక్షతలను గుర్తు చేస్తూ విద్యా రంగ ప్రముఖులు, లయన్స్, అవొపా సంస్థల ప్రముఖులు నివాళులర్పించారు.
దివంగత అంజయ్య కు ముగ్గురు సోదరులు విజయకుమార్, వినోద్ కుమార్, రవికుమార్ కాగా విజయకుమారు కుమారుడు సుకేష్ కుమార్ కర్మ ఆచరించారు.
అంతిమ యాత్రలో పాల్గొని నివాలు లర్పించిన వారిలో కాకతీయ విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్ రెడ్ది, పూర్వ ఆచార్యులు టి. సుధాకర్ రెడ్ది, రమణయ్య, శంకరయ్య, లయన్స్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్ది, గవర్నర్ ఎలెక్ట్ డా. చంద్రశేఖర్ ఆర్య, వైస్ జిల్లా గవర్నర్లు ఎన్. సుధాకర్ రెడ్ది, పి. హరికిషన్ రెడ్ది, పూర్వ జిల్లా గవర్నర్లు కె. గోవింద్ రాజ్, ఎందుకు. వెంకటేశ్వర రావు, కె. సి. జాన్ బన్నీ, ముచ్చ రాజి రెడ్ది, టి. లక్ష్మి నరసింహ రావు, డా. కె. రాజేందర్ రెడ్ది, లయన్స్ నాయకులు వజ్రపు సత్యనారాయణ, డా. ఆర్. ది. చారి, ఇ. ప్రతాప్ రెడ్ది, అల్లాడి ఈశ్వర్ రావు, ప్రభాకర్ రావు, కుర్రేముల యాదగిరి, నాగబండి రవీందర్, డా. సి హెచ్. రాజమౌళి, చంద్రగిరి శ్రీనివాస్, ప్రసాద్, రామిని శ్రీనివాసులు, మారం లక్ష్మయ్య, చందుపట్ల రవీందర్ రెడ్ది, కలువల భాస్కర్ రెడ్ది, పి. జయహరి, పి. లక్ష్మి నర్సయ్య, డా. కిరణ్ కుమార్, జి. ప్రమోద్ కుమార్, క్రిష్ణ జీవన్ బజాజ్, జైన రమేశ్, మహమ్మద్ అబ్దుల్ రహమాన్, మాజీద్ ఆఫ్సర్, వై. సంజీవరెడ్డి, ఉప్పలయ్య, డా. పి. నాగేశ్వర్ రావు, గాదె నర్సింహులు, మర్యాల అశోక్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking