సంచార ముస్లిం తెగల సంక్షేమానికి కృషి
శాసనమండలి సభ్యులు అమీర్ అలీ ఖాన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో అత్యంత వెనుకబాటుకు గురైన సంచార ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తానని తెలంగాణ శాసన మండలి సభ్యులు అమీర్ అలీ ఖాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమశాఖ కు కేటాయించిన బడ్జెట్లో సంచార ముస్లిం తెగలకు ప్రత్యేకంగా రూ అయిదు కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సంచార ముస్లిం తెగల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సైదాఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తో పాటు మైనార్టీ డెవాలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబెదుల్లా కొత్వాల్ నుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ను శాలువాకప్పి గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అత్యంత వెనుకబాటుతనంలో జీవనం గడుపుతున్న సంచార ముస్లిం తెగల సమస్యలను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంచార ముస్లిం తెగల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. సంచార ముస్లిం తెగలకు చెందిన యువకులు విద్యార్థులు తెలంగాణ రాష్టంలో ప్రజాప్రభుత్వం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కల్పిస్తున్న సంక్షేమ ఉపాధి విద్య అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించి ఉన్నత స్థాయికిచేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంచార ముస్లిం తెగల సంఘం నాయకులు శేక్ అలీ రసూల్ పడేశా రషీద్ షేక్ మౌలాలి జానీ మియా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.