సీఎం సహాయ నిధి పేదలకు వరం

సీఎం సహాయ నిధి
పేదలకు వరం

జిల్లా కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి మర్రి ఎలియాస్

అక్షిత న్యూస్, వేములపల్లి:

మనసున్న తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని రావులపెంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మర్రి ఎలియాస్ అన్నారు. వేముల పల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన అండ్లపూరి అభిషేక్ ఇటీవల అనారోగ్యానికి గురివై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఏలియాస్ ద్వారా ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో అభిషేక్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజురైన రూ. 1,00,000 విలువ గల చెక్కు ల శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి ఎలియాస్ చేతుల మీదగా లబ్దిదారునికి అందచేశారు.ఈ కార్యక్రమంలో రావులపెంట గ్రామ కాంగ్రేస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking