తిరంగా యాత్ర
మిర్యాలగూడ మే 27 అక్షిత ప్రతినిధి :సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడంతో బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలను చేత బూని పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ నుండి తెలంగాణ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గుండా రాజీవ్ చౌక్ వరకు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సైన్యం త్రివిధ దళాల పాత్ర గర్వంగా ఉందని అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రష్యన్ డాక్టర్ త్రిమూరే లియోనోవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి, కనపర్తి సత్యప్రసాద్, సజ్జల నాగిరెడ్డి, ఒకటో, రెండో పట్టణ, మండల అధ్యక్ష కార్యదర్శులు బంటు గిరి, పి.వెంకటరమణ, రవి, కె.వెంకటరమణ, మూల రాజిరెడ్డి, బంటు యాదగిరి, మండల సోములు, అశోక్, చరణ్, విశ్రాంత అధికారులు, సైనికులు పాల్గొన్నారు.
Next Post