నాటని చెట్లకు
హడావిడిగా బిల్లు
ఎవెన్యూ ప్లాంటేషన్
జరగనే లేదు !
రూ 70 లక్షలు ఎలా చెల్లించారు ?
మిర్యాలగూడ మున్సిపాలిటీలో
అధికారుల ఇష్టారాజ్యమా?
మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్
మిర్యాలగూడ, మే 27 అక్షిత ప్రతినిధి : నాటని చెట్లకు హడావిడిగా బిల్లు ఎలా చెల్లించారు.ఎవెన్యూ ప్లాంటేషన్ జరగనే లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ప్రశ్నించారు. స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ బైపాస్ రోడ్ లో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయలు నిధులు స్వాహా చేసారని రూ 70 లక్షలు ఎలా చెల్లించారని ఆరోపించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యమా? అని ప్రశ్నించారు.

2023లో బైపాస్ రోడ్డు వెంట చెట్లు నాటేందుకు మూడు నెలల చెట్లు నాటడం పూర్తి చేయాలని టెండర్లు పిలిచారని నాటి నుండి ఇప్పటివరకు బైపాస్ వెంట ఎలాంటి చెట్లను నాటలేదని 2023 లో పిలిచిన టెండర్లకు మున్సిపల్ కాంట్రాక్టు చట్టాలను పక్కదారి పట్టించి ఇప్పుడు మున్సిపల్ అధికారులు హడావుడిగా బిల్లు చేసి 70 లక్షల విడుదల చేసారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ నిబంధనలన్నీ అధికారులకు అనుగుణంగా మార్చుకొని ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారన్నారు. సదరు కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోవడముతో అప్పుడు ఉన్న మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ ఏ ఈ బిల్ రికార్డు చేయలేదని వివరించారు.

2023వ సంవత్సరం లో శాసనసభ ఎన్నికలు జరగడం రేవంతరెడ్డి నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిందని, ఫిబ్రవరి నెలలో అప్పుడు ఉన్న మున్సిపల్ కమీషనర్ మున్సిపల్ ఇంజనీర్ మున్సిపల్ ఏఈ లు బదిలీ అయ్యారు,. అనంతరం కొత్తగా వచ్చిన కమీషనర్ మున్సిపల్ ఇంజనీర్ ఏ ఈలు వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ చెట్టులు పెట్టలేదని బైపాస్ రోడ్ లో ఒక్క చెట్టు కుడా ఈ కాంట్రాక్టర్ నాటలేదన్నారు. అయినప్పటికీ ప్రస్తుత కమీషనర్ , మున్సిపల్ ఇంజనీర్,ఏ ఈ లు హడావిడిగా బిల్స్ రికార్డు చేసి చెక్ ఇచ్చారని తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో పని చేయలేదన్నారు. ఈ విధంగా చేయని పనులకు బిల్లులు మంజూరు చేయడం అనేది మిర్యాలగూడ మున్సిపాలిటీ లో ఏనాడు కుడా ఇలా జరగలేదని, బైపాస్ అవెన్యూ ప్లాంటేషన్ విషయంలో విజిలేన్స్ ఎంక్వయిరీ చేయవల్చిందిగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,జిల్లా కలెక్టర్ ని కోరానన్నారు