ఈ పాస్ మెషిన్ తోనే
ఎరువుల విక్రయాలు
*డీలర్లు విక్రయధ రల పట్టికలను షాపులలో విధిగా ఏర్పాటు చేయాలి
*నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్
మిర్యాలగూడ, మే 29 అక్షిత ప్రతినిధి :
రైతులకు నాసిరకం విత్తనాలు పురుగు మందులు అమ్మి కీడు తలపెట్టొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిశ్రావణ్ కుమార్ అన్నారు. మిర్యాలగూడ మండల రైతువేదికలో గురువారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ఇన్పుట్ డీలర్స్లను వానాకాలం సీజన్లో సమాయత్త పరుస్తూ నిర్వహించిన పునశ్చరణ సమావేశంలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ డీలర్లు అందరూ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. విత్తనాలు కొన్న ప్రతి రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే వారిపై శాఖాపర కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విత్తనాలు ఎమ్మార్పీ ధరకు మించి అమ్మరాదని, ఎరువులు ఈపాస్ మెషిన్ ద్వారా మాత్రమే విక్రయాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు పెడదారి కట్టేందుకు సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నామన్నారు. డీలర్లు అందరు షాప్ లలో విక్రయ ధరల బోర్డులను విధిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ ఇంచార్జ్ ఎడిఎ డి.సైదానాయక్, ఇన్చార్జ్ ఏడిఏ మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారులు శివరాంకుమార్, విశ్వం, సరిత, కిషోర్ నాయక్, డివిజన్ పరిధిలోని డీలర్లు, ఏఈవోలు రమేష్ నాయక్, షఫీ, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.