యోగాతో మానసిక ఉల్లాసం

యోగాతో మానసిక ఉల్లాసం

ఆమనగల్లు హోమియోపతి వైద్యురాలు డా.భవాని

అక్షిత న్యూస్, వేములపల్లి:

మానసిక, శారీరక ఆరోగ్యం, ఆరోగ్యం పెంపొందించడానికి యోగ తోడ్పడుతుందని ఆమనగల్లు హోమియోపతి వైద్యురాలు డాక్టర్ భవాని అన్నారు. వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామం లోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు 11వ అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని హోమియోపతి వైద్యురాలు ఆధ్వర్యంలో యోగ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి యోగ ఆసనాలు చేయించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగ ఫర్ వన్,హెల్త్ వన్ హెల్త్, అని గ్రామ ప్రజలతో నినాదాలు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు రెండు గంటలపాటు యోగా చేసినట్లయితే ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో చిన్నపిల్లలకు, వయోవృద్ధులకు యోగ నేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు పరమేష్,శ్రావణి ఏఎన్ఎం జ్యోతి, గురుస్వామి,హెల్త్ అసిస్టెంట్ నర్సయ్య, ఆశ వర్కర్లు వెంకటమ్మ,అన్నపూర్ణ, సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking