దళిత విద్యార్థులను
అవమానించిన సెక్రటరీ
గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణిని వెంటనే సస్పెండ్ చేయాలి
అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దామళ్ళ సత్యం
హైదరాబాద్, అక్షిత బ్యూరో :
పిల్లల చేత వెట్టి పనులు చేయించేందుకు ఒడిగట్టిన
గురుకులాల సెక్రటరీని వెంటనే తొలగించాలని
తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కూరెళ్ళ మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణిని వెంటనే మార్చాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తావని టిఎస్ఎస్ఏ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి దళితుల్ని అవమానపరిచిన తీరు చాలా అవమానం.. దళిత పిల్లలు వారు ఏమైనా రాజ సింహాసనం నుంచి వచ్చారా? వారేమైనా రాజులా అన్నట్టు వెటకారంగా మాట్లాడిన సెక్రటరీ అలుగు వర్షిణి వెంటనే సస్పెండ్ చేయాలని మండిపడ్డారు.ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి అన్నిటికీ అవమానాలకు బాధలను భరిస్తూ ఈ దేశంలో మహత్మ జ్యోతి బాపూలే దగ్గర నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు కూడా ఎన్నో అవమానాలు ఎదురుకున్నారన్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం వల్ల ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలు చదువులు.. ఆటలు, ఉద్యోగాల్లో రాణిస్తుంటే
అది చూసి ఓర్వలేక ఒక ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి ప్రవర్తన యావత్ దళిత జాతిని అవమానపరిచే విధంగా ఉందన్నారు.
గురు కులాలకు వచ్చే పిల్లలు ఏమైనా రాజభవనం నుండి వస్తున్నారా? ఏమైనా సింహాసనం నుండి వస్తున్నారా ? వారు వచ్చేది పూరి గుడిసెల నుంచే కాబట్టి వారు వచ్చి వారి పనులు వారు చేసుకొని చదువుకోవాలని
అవమానించడం తగదన్నారు.ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడే సెక్రెటరీ మా గురుకులాలకు అవసరం లేదని వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఆమె దళితుల పట్ల దళిత విద్యార్థి విద్యార్థినీ, విద్యార్థుల పట్ల ఎలాంటి పనులు చేపిస్తాదో కూడా ఆమె ఉద్దేశం అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా మంత్రివర్గంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ, నేతలు వివేక్ వెంకటస్వామి లాంటి వారు చొరవ తీసుకుని ఆమెను సస్పెండ్ చేయించి గురుకులాలను కాపాడి దళిత విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వింత ప్రవర్తన యావత్ దళిత జాతికి నష్టం జరుగుతుందన్నారు. ఆమెని వెంటనే గురుకుల నుంచి తొలగించి దళిత బడుగు బలహీన వర్గలకు నాయ్యం చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
ఎందుకంటే ఇలాంటి అధికారుల వల్ల విద్యార్థిని విద్యార్థులు చదవలేక, అటు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇలాంటి అధికారులను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేసి గురుకులాలకు న్యాయం చేయాలని,అలుగు వర్షిణికి డ్రైవర్, ఇంట్లో వంట వాళ్ళు ఎందుకు? ఆమె పనులు ఆమె చేసుకుంటే చాలా బాగుంటదన్నారు. తను ఒక ఆఫీసర్ గా ఉండి కూడా అన్ని అనుభవిస్తూ రాజభాగాలు అనుభవిస్తూ దళితుల పట్ల వివక్ష పూరితంగా మాట్లాడటం సబబు కాదన్నారు. ఇలాంటి అధికారి గురుకులాలకు సెక్రటరీగా ఉండరాదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వం తెలంగాణ గురుకులాలు కాపాడాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యమాల్ని ఉదృతం చేయాల్సి వస్తుందని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు కూరెళ్ళ మహేష్ కుమార్ ,దామల సత్యనారాయణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భూసారంబాగ్ చౌరస్తా, అంబేద్కర్ స్టార్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకులాల సెక్రెటరీ అగ్రకుల అహంకారి అలుగు వర్షిణిని వెంటనే తొలగించాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారా సతీష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిటీపాక ప్రభాకర్, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పవన్, సునీల్ నందు తదితర నాయకులు పాల్గొన్నారు.