శిక్షణతో నైపుణ్యం.. విజ్ఞానం
*-మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి*
అచ్చంపేట, మే29 అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టుల శిక్షణ తరగతులతో విజ్ఞానాన్ని నైపుణ్యాన్ని కోవడానికి దోహదపడుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని అటవీ శాఖ వనమాలిక వద్ద తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం, అటవీశాఖ సౌజన్యంతో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభం ఉపన్యాస చేశారు.సభా అధ్యక్షత వహించి ఆహ్వానం పలికినవారు ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కూచూకుళ్ళ దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు వాస్తవానికి ములుగు జిల్లాలో ప్రారంభించాలని అనుకున్న సాంకేతిక సమస్యలు అవాంతరాలు ఎదురు కావడంతో అకాడమీ నిర్ణయంతో నల్లమల్ల ప్రాంతాన్ని ఎంచుకున్నామన్నారు.

దాదాపు 150 మంది ఫ్రెంట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శిక్షణ తరగతులకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని రెండు సెషన్ల లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా జర్నలిజంలో ఎదురవుతున్న సమస్యలు వర్తమానం వివిధ అంశాలపై వక్తలు మాట్లాడతారని, జర్నలిస్టులకు జ్ఞానం పెంపొందించుకునేల వివిధ అంశాలతో కూడిన 10 పుస్తకాల కిట్టును అందిస్తున్నామని ఆ పుస్తకాలు మీకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందిస్తాయని గుర్తు చేశారు. క్వాలిటీ జర్నలిజం ఇలాంటి శిక్షణ తరగతులు మీడియా మిత్రులకు క్వాలిటీ జర్నలిజంపై అవగాహన జ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అన్నారు. ఒక మంచి వాతావరణంలో శిక్షణ తరగతులు జరగటం శుభకరణమని జర్నలిస్టు ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ వారు స్థానిక సమస్యలను అవసరాలను ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వార్తలు రాయడం వల్ల వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకునేలా క్వాలిటీ జర్నలిస్టులుగా పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. అనంతరం అటవీశాఖ సంబంధించిన ఆర్గనైజర్ శ్వేత మాట్లాడుతూ నల్లమల్ల ఫారెస్ట్ ఇప్పుడిప్పుడే బయటి సమాజానికి ఎంతగానో పరిచయం అవుతుందని దాదాపు 150 మందికి టూరిజం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఆదివాసి గిరిజనులతో పాటు ఇతరులకు కల్పిస్తున్నామని ఇటీవలనే గవర్నర్ నిధులతో 32 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి స్కిల్ ఇండియా అనే సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేయించామని, వారు ఇతర రాష్ట్రాలలో కూడా పనిచేసుకునే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే చెంచుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడేలా మా వంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా నల్లమల ప్రాంతాన్ని తిలకించేందుకు లండన్, యూఎస్, ఆఫ్రికా లాంటి దేశాల నుండి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకొని సందర్శిస్తున్నారని తెలిపారు. ఈ ప్రారంభ సమావేశంలో ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్, విశాలాంధ్ర ఎడిటర్ ఆర్ వి రామారావు, పియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, మూడవత్ రాములు, తెలంగాణ మీడియా సిబ్బంది పూర్ణచంద్రరావు, మేనేజర్ శనేశ్వర రెడ్డి, ఓ ఎస్ డి రెహమాన్, స్థానిక నాయకులు సాయిబాబా, వెంకటయ్య, శ్రీధర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.