ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం

ప్లాస్టిక్ కాలుష్యం
అంతం చేద్దాం

మయూరి ఎకో పార్క్ వద్ద
ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేత

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

పర్యావరణం, మానవాళి మనుగడకు హాని కలిగించే ప్లాస్టిక్ కాలుష్యంను అంతం చేద్దాం అని జిల్లా కలెక్టర్ వి జయేందిర బోయి అన్నారు.
నిత్య జీవితంలోప్లాస్టిక్ వాడకం నిర్మూలించి పర్యావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆమె అన్నారు.గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మయూరి పార్క్ వద్ద రహదారి వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే డ్రైవ్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,జిల్లా అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అధికారులు, విద్యార్థులు మయూరి ఎకో పార్క్ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేసే కార్యక్రమం లో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలు ట్రాక్టర్ లో వేయడం జరిగింది.ఈ సందర్భంగా మయూరి ఎకో పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణం దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం *ప్లాస్టిక్ ను జయిద్దాం* అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి మాన ఆరోగ్యంకు చాలా ప్రమాదకరమని, ప్లాస్టిక్ వినియోగం అంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలిపారు.ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి వెళ్ళడం వల్ల సముద్ర జీవులు మరణిస్తాయి, ఆహార గొలుసులో విష పదార్థాలు చేరతాయని, ప్లాస్టిక్ వస్తువులు కుళ్ళిపోవడానికి చాలా సమయం పడుతుంది, ప్లాస్టిక్ కణాలు మట్టి, నీరు, ఆహారంలోకి చేరి మానవులకు హాని కలిగిస్తాయని తెలిపారు.ప్లాస్టిక్ వ్యర్థాలు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తాయన్నారు.

ఇది నేల యొక్క సారవంతతను తగ్గిస్తుంది, నీటి వనరులను కలుషితం చేస్తుందని పేర్కొన్నారు.ప్లాస్టిక్ పారవేసేటప్పుడు వెలువడే గ్యాసులు వాతావరణ కాలుష్యానికి కారణమవుతాయి.ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జీవులు తింటే అవి విషపూరితమవుతయనిని, మరణిస్తాయని అన్నారు. ప్లాస్టిక్ సముద్ర జీవుల ఆవాసాలను నాశనం చేస్తుందని అన్నారు.ప్లాస్టిక్ కణాలు మన ఆహారంలో మరియు నీటిలో చేరి మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని,
ఇది క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు.

*ఆహార భద్రతకు ముప్పు*

ప్లాస్టిక్ కాలుష్యం ఆహార వనరులను కలుషితం చేయడమే కాక ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని అన్నారు.ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణ వ్యవస్థల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకానన్ని ప్లాస్టిక్ సంచులు, బాటిళ్ళు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు.పునర్వినియోగం చేయదగిన వస్తువులను వాడాలని అన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేసి,రీ సైకిల్ చేయాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పిలుపు నిచ్చారు ఒకసారి ఉపయోగించి పారవేసే తక్కువమందం గల సింగల్ యూస్ ప్లాస్టిక్ ను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించనాడే లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, వకృత్వం,డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన వారికి మెమెంటోలు కలెక్టర్ అంద చేశారు.పర్యావరణ కాలుష్య మండలి ద్వారా జూట్ తో తయారు చేసిన బ్యాగ్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల కు బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల అధ్యాపకులు సదాశివయ్య స్నేక్ షో ను విద్యార్థులు తిలకించారు. తొలుత స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని డి.ఎఫ్. ఓ సత్య నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్.ఓ సత్య నారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ డిపిఆర్.ఓ శ్రీనివాస్, ఎల్.డి. ఎం కల్వ భాస్కర్, పరిశ్రమల శాఖ జిఎం ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking