కొత్తవి సరే పాత శంకుస్థాపనలు సంగతి తేల్చరా మంత్రి వర్యా

కొత్తవి సరే పాత శంకుస్థాపనలు సంగతి తేల్చరా మంత్రి వర్యా

వరంగల్ తూర్పు లో గతం లో చేసిన శంకుస్థాపనల కు మోక్షం ఎపుడో

ప్రభుత్వ ఆస్తులు కాపాడుకుంటే ప్రైవేట్ బారం తగ్గుతుంది. ఇది ఎవరికైనా నష్టం చేస్తుందా

వరంగల్, అక్షిత బ్యూరో:

కొత్త ప్రారంభోత్సవాలు భూమి పూజలు శంకుస్థాపనలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ గతంలో తాము చేసిన హామీలు తమ ప్రారంభించిన భవనాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇంకా పూర్తి కావడం లేదు.8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కోట్ల రూపాయలు ప్రజా ధనం తో పనులు ప్రారంభించి వదిలేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో 8 సంవత్సరాల క్రితం ఇప్పుడు మంత్రిగా ఉండి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న కొండా సురేఖ సారధ్యంలో మైనారిటీ షాదీఖానా రజక భవన నిర్మాణం శంకుస్థాపనలు చేసి ఒక భవనం నాలుగంతస్తుల స్లాబ్ వరకు వచ్చి రజక కమ్యూనిటీ భవనం పిల్లర్ల కాడికి పరిమితమైంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉండి ఈ పనులకు శంకుస్థాపనలు చేసిన అప్పటి ఎమ్మెల్యే నే ఇప్పుడు శాసన సభ్యురాలుగా మంత్రిగా ఉన్నారు. మధ్యలో నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా ఉండి మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహించేందుకు కొంత ప్రయత్నం చేసి ఎన్నికలు రావడంతో ఆ ప్రయత్నాలు అక్కడే ఆగిపోయాయి. రజక భవనానికి ఏ విధమైన ప్రయత్నాలు జరగలేదు.

ప్రజల సౌకర్యార్థం విద్య సంక్షేమం అభివృద్ధి గురుకుల పాఠశాలల నిర్వహణ కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను మరమ్మత్తులు చేసి కొత్త భవనాలు శాశ్వతంగా పనిచేసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మైనారిటీ షాది ఖానా పక్కనే ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ఉపయోగం లేకుండా శిథిలమైతున్న క్రమంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నట్టు చూపిస్తున్నారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ హాస్టల్ 12వ డివిజన్ దేశాయిపేటలో ఏ ఒక్క విద్యార్థికి హాస్టల్ సౌకర్యం కల్పించలేదు కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాత్రమే తన సేవలందిస్తుంది. ఇప్పటికీ సంబంధిత విద్యాశాఖ సంక్షేమ హాస్టల్లో జిల్లా కలెక్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ ఈ విషయాలపై సమీక్ష నిర్వహించి వీటిని వెలుగులోకి తేవాలని స్థానిక ప్రజలతో పాటు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండే ప్రభుత్వ ఆస్తులను కాపాడి వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking