జలయోగాన్యాసంలో దిట్ట.. రాం రంగారావు

జలయోగాన్యాసంలో దిట్ట.. రాం రంగారావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన న్యాయవాది తడకమళ్ళ రామ్ రంగారావు నలభయ్యేళ్లుగా యోగాభ్యాసం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. సర్వంగాసనం, భుజంగాసనం, మయూరాసనం, పవనముక్తాసనం, సర్పాసనం, శీర్షాసనం, హలాసనం, సుఖాసనంలో తనదైన శైలిలో నైపుణ్యం సాధించారు. అన్నింటా నైపుణ్యం సాధిస్తూ, జలయోగాన్యాసంలో దిట్ట.

నీటిలో ఈత కొడుతూ యోగా విన్యాసాలు చేయడం ఆయన ప్రతిభాపాటవాలకు నిదర్శనం. మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి, ఆరోగ్యానికి యోగాసనాల కంటే మించిన దివ్య ఔషదం ఏది లేదని రంగారావు అన్నారు. శారీరక, మానసిక వత్తిడుల నుండి విముక్తి పొందాలంటే యోగాభ్యాసం అనివార్యమని, ప్రతి ఒక్కరూ యోగాభ్యసించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking