రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకం

రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకం

-రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి

ఖమ్మం /అక్షిత బ్యూరో :

రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి మయూరి సెంటర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా ఎక్స్టెండెడ్ ఎక్స్ క్యూటివ్ సమావేశం సుమారు 300 మంది జిల్లా అసెంబ్లీ మండల కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. మన పని మనం చేసుకు పోవాలని పార్టీ తన పని తాను చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే అయినా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ఏ మాత్రం రాజీ పడకుండా అనుకున్న విధముగా అన్ని వాగ్దానాలు అమలు చేసుకుంటూ పోతుందని అన్నారు.ప్రతిపక్ష పార్టీ అదే పనిగా కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని దాన్ని మనం గ్రామ స్థాయిలో తిప్పి కొట్టాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ మాట్లాడుతూ రాబోవు లోకల్ బాడీ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ తో గెలుపొందేలా కృషి చేయాలని అన్నారు.

సీనియర్ల సలహాలు సూచనలతో నూతన కార్యవర్గం ముందుకు పోతున్నదని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మారుమూల ప్రాంతాల్లో కి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.రాబోవు ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పటిష్ఠంగా ఉన్న దగ్గర యువజన కాంగ్రెస్ కే అత్యధిక సీట్లు వచ్చే విధాంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో కోట్లాడదామని అన్నారు.జిల్లా ఇంచార్జి దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావడానికి యువజన కాంగ్రెస్ ఒక ఫ్లాట్ ఫామ్ వంటిదని అన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. యువజన కాంగ్రెస్ లో కొత్త పాత ఏమీ లేదని ఎవరికీ ఏ సాయం కావాలి అన్నా జిల్లా ఇంచార్జీ గా ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు.ప్రతి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పని చేసి మీరు చేసిన పని గుర్తు పెట్టుకునేలా చేసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చేసిన ప్రతి పని దాని ద్వారా రాష్ట్ర నాయకులు తెలిసే విధముగా సర్క్యులేట్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ కుమార్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ ఖలీల్ పాషా బెజ్జం గంగాధర్ భానోత్ కొటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల మహేష్ క్రాంతి బెల్లంకొండ శరత్ రాధాకృష్ణ ఉత్తేజ్ భూక్యా భద్రం కార్తీక్ అన్ని అసెంబ్లీ నియోజక వర్గ అద్యక్షులు మండల అద్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking