ఖమ్మం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కి మహబూబాబాద్ జిల్లా ఎస్ఈగా అదనపు బాధ్యతలు
ఖమ్మం /అక్షిత బ్యూరో :
తెలంగాణ ఉత్తర పంపిణీ విద్యుత్ సంస్థ( ఎన్పీడీసీఎల్) ఖమ్మం సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇనుగుర్తి శ్రీనివాసచారికి మహబూబాబాద్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించడానికి నియమితులయ్యారు. ఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.