ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఐఎంఏ లక్ష్యం
ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్
చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల ప్రాంత ప్రజలకు నాణ్యమైన సరళమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ కు అనుబంధంగా డాక్టర్స్ అసోసియేషన్ అనుబంధంగా ఏర్పడిందని తెలిపారు. ఈ అసోసియేషన్ వైద్య సేవలతో పాటు, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం మా అసోసియేషన్ కూడా పనిచేస్తుందని, వృత్తి వైద్య పరంగా అర్హత కలిగిన డాక్టర్లకు ఎదురయ్యే ఇబ్బందుల పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇతర వారెవరైనా ప్రజలపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే వారి పరిధిలోనే వైద్యం చేయాలని సూచించారు. అలోపతి అర్హత కలిగిన ఎంబిబిఎస్ ఆపై డిగ్రీలు కలిగిన డాక్టర్లు వృత్తి విలువలను సమాజంలో డాక్టర్లకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎంబిబిఎస్ తో పాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి వైద్యులు అర్హత లేని ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ గా వచ్చి పని చేస్తూ వృత్తి గౌరవానికి భంగం కల్పించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ చేర్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి తుంగ రఘునందన్ రాణా, ఉపాధ్యక్షులు ఏడెల్లి సంతోష్ కుమార్, డా. కే. బాలకిషన్, డా. సతీష్, డా. కాశెట్టి మంజుల, డా.టీ. శ్వేతా పాల్గొన్నారు.