యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేద్దాం

యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేద్దాం

-ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్.
– యాదవులకు మంత్రివర్గంలో వెంటనే స్థానం కల్పించాలి.
– యాదవుల జన దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలి.
– రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి.
– యాదవ కార్పొరేషన్ కు 10వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.

దుబ్బాక అక్షిత ప్రతినిధి:
రాష్ట్రంలో ఎంతో గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగివున్న యాదవులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల పాలన, కుటుంబ పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. కామరెడ్డి బిసి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు ముఖ్యంగా యాదవులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలలో యాదవులకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యాదవులతోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మంత్రివర్గంలో చోటు కల్పించాలని శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈనెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరగబోయే యాదవుల ఆత్మగౌరవ సభను పార్టీలు, సంఘాలకు అతీతంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 53% ఓట్లేసి అండగా నిలబడిన యాదవులకు కాంగ్రెస్ పార్టీ సరియైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచన చేసి యాదవులకు మంత్రి పదవితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నమ్మి ఓట్లేసిన యాదవులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారుల ఖాతాల్లో రెండు లక్షల రూపాయలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా తమకు రావలసిన వాటా ఇవ్వకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాదవులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా యాదవుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని కోరారు ఈనెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర తలపెట్టిన యాదవుల ఆత్మగౌరవ సభను పార్టీలు సంఘాలకు అతీతంగా దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking