స్వేచ్ఛ మృతికి మిర్యాలగూడ జర్నలిస్టుల సంతాపం
మిర్యాలగూడ, జూన్ 29 అక్షిత ప్రతినిధి :
జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతి పట్ల మిర్యాలగూడ జర్నలిస్టులు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. ఆదివారం ఎన్ఎస్పి క్యాంపులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటన్నారు. జర్నలిస్టు స్వేచ్ఛ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజా హామీదుద్దిన్, ఎండి.అస్లాం, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకన్న, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జి.మహేష్, జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్,నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు మంద సైదులు, జయరాజు, జర్నలిస్టులు అరుణ్, నాగరాజు, రామ్ ప్రసాద్, నక్క శ్రీను, నాగేందర్, ప్రసాద్, సైదులు, నరసింహ, రవి, ఉమర్, రఫీ ఖాన్, నాగచారి, శివ, సతీష్, శ్యామ్ పాల్గొన్నారు.
Prev Post
Next Post