పత్రికా స్వేచ్ఛను హరించొద్దు 

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు 

మిర్యాలగూడ, జూన్ 29 అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్ లో మహా న్యూస్ కార్యాలయానిపై దుండగుల దాడికి ఆదివారం మిర్యాలగూడ జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు, అనంతరం పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో ఎఎస్ఐ లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేశారు. స్థానిక సాగర్ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం, ఆర్టిసి బస్టాండ్ అక్కడ ఎన్ఎస్పి క్యాంపు, తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం గుండా పోలీసు సబ్ డివిజన్ కార్యాలయానికి చేరుకుని ఎఎస్ఐ లక్ష్మణ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మహా న్యూస్ కార్యాలయానిపై దుండగులు అతి దారుణంగా దాడి చేసి విధ్వంసం సృష్టించారన్నారు.

ఇలాంటి సంఘటన ఎక్కడ చూడ లేదని వారన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తగదని, ఏదైనా ఉంటే వివరణ ఇవ్వాలని కోర్టులున్నాయని వాటిలో తేల్చుకోవాలన్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదని, దాడి చేసిన దుండగులను అరెస్టు కఠినతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజా హామీదుద్దిన్, ఎండి.అస్లాం, టిడబ్లుజెఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకన్న, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జి.మహేష్, జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులుఎండి.అయూబ్, మంద సైదులు, కార్యదర్శి గద్దల జయరాజు, జర్నలిస్టులు అరుణ్, నాగరాజు, రామ్ ప్రసాద్, నక్క శ్రీను, నాగేందర్, ప్రసాద్, సైదులు, నరసింహ, రవి, ఉమర్, రఫీ ఖాన్, శివ, సతీష్, శ్యామ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking