అదాని లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దు

అదాని లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దు

కాలుష్య కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే సహించేది లేదు

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

ఆదాని లాజిస్టిక్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ వారికి రామన్నపేట మండల కేంద్రంతోపాటు కొమ్మాయిగూడెం మరియు సిరిపురం గ్రామాల మధ్య గల సర్వే నెంబర్లలలో 575,619, 593, 594,592, 728,585,586,587,588, 589,590, 108,131,132,130,135, 448,449,450,451, 452,453,447, 446,443,442,441,444, 445, ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, కాలుష్య కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రామన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో అదాని లాజిస్టిక్ కంపెనీ లిమిటెడ్ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని మండల కేంద్రంలో వేయి సంతకాల సేకరణ కార్యక్రమంను చేపట్టారు.

అనంతరం సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్, ఎంపీడీవో, రామన్నపేట గ్రామపంచాయతీ కార్యదర్శి కు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపిటిసీ, పర్యావరణ పరిరక్షణ వేదిక కోకన్వీనర్ ఎండి రెహాన్ మాట్లాడుతూ..‌ అదాని లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆన్లైన్లో కంపెనీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ వారు ఎలాంటి కంపెనీ పెడుతున్నారో స్పష్టంగా దరఖాస్తులో పేర్కొనలేదు. అదాని గ్రూప్ వారు గతంలో కూడా డిపిండిషియా ఇన్స్ట్రక్చర్ కంపెనీతో లీజ్ తీసుకున్నారు. అలా లీజు తీసుకున్న స్థలంలో అదాని గ్రూప్ వారు అంబుజా సిమెంట్ కంపెనీ పెడతామని కాలుష్య మండలితో గత సంవత్సరం 2024 అక్టోబర్ 23న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో రామన్నపేట మండల ప్రజలు పాల్గొని అధాని గ్రూప్ వారికి అంబుజా సిమెంట్ కంపెనీ పెట్టవద్దని మా కుమ్మడిగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు తిరిగి అధాని గ్రూప్ వారు లాజిస్టిక్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం జరిగింది. కానీ ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారన్నది తెలియపరచలేదు. అదాని గ్రూప్ కంపెనీ వారు ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు గ్రామసభ ఏర్పాటుచేసి తెలియపరచాలని డిమాండ్ చేశారు. కాలుష్యకారక కంపెనీలకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి కాలుష్య కారక ఎలాంటి కంపెనీలకు మండలంలో అనుమతులు ఇవ్వవద్దని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జింకల ప్రభాకర్, గోదాసు పృథ్వీరాజ్, జెల్లవెంకటేశం, వనం చంద్రశేఖర్, ఎండి జమీరొద్దీన్, ఎండి అక్రమ్, పెద్ద గోని వెంకటేశం, బొడ్డు సాలయ్య, ఎండి నాసర్, కోట సుధాకర్, కూనూరు కృష్ణ, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, లెంకల ప్రవీణ్, డేవిడ్ శేఖర్, మోటె రమేష్, ఎండి మన్సూర్, నోముల ప్రవీణ్, మిర్జా ఇనాయత్ బేగ్, మినుముల సందీప్, అస్లం బేగ్, మోటె మహేష్, ఎండి కరీం, గురుకు శివ, అజర్, లవణం సాయి, నిజామొద్దీన్, గంగాపురం శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking