సంపదలెన్ని ఉన్నా
సంతోషం లేకుంటే సున్న
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“ఎన్ని సంపదలు ఉన్నా జీవితంలో సంతోషం లేకపోతే ఆ జీవితం పరిపూర్ణం కాదని..”తెలంగాణాల రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత టి. వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ రచయిత. జర్నలిస్ట్ విజయార్కె కలిసి రాసిన వ్యక్తిత్వ వికాస రచన “హ్యాపీ లైఫ్.. మీ ఆనందం. మీ చేతుల్లో”పుస్తకాన్ని తెలంగాణాల రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.”..ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పుస్తకాల అవసరం ఉందని, ఈ పుస్తకం జీవితంలో సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు.సమాజానికి అవసరమయ్యే ” హ్యాపీ లైఫ్ ” పుస్తకాన్ని రాసిన రచయితలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. పుస్తక రచయితల్లో ఒకరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ'” ఆరు నెలల పాటు శ్రమించి, సంతోషకరమైన జీవితానికి ఉపయోగపడే ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచాం జీవితంలో కోల్పోతున్న సంతోషాన్ని మీకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది”అన్నారు. రచయిత విజయార్కె మాట్లాడుతూ”సంతోషం లేని జీవితం, ఆత్మ లేని దేహం లాంటిది.. సంతోషాన్ని మించిన సంతృప్తి లేదు.అలాంటి సంతోషకరమైన జీవితాన్ని మీకు ఈ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం చేశామని.”అన్నారు.