ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

జిల్లా కేంద్రంలో బోయపల్లి రోడ్ లో నున్న ప్రభుత్వ గిరిజిన బాలుర వసతి గృహన్ని మంగళవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఆకస్మిక తనిఖీ చేశారు .

వసతి గృహ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ గదులకు కిటికీలకు దోమ తెరలు లేవని, త్రాగుటకు మినరల్ వాటర్ లేవని తెలిపినారు.. విద్యార్థులకు మినరల్ వాటర్ ఇవ్వాలని, మెనూ ప్రకారం భోజనము అందించాలని వసతి గృహ సంక్షేమ అధికారిని ఆదేశించారు. దోమల నివారణకు 10 ఆల్ అవుట్ తక్షణం రెవెన్యూ అదనపు కలెక్టర్ కొని అంద చేశారు.వసతి గృహమునకు కావలసిన మరమ్మతులు, RO ప్లాంటు ఏర్పాటుకు
తగు చర్యలు తీసుకోవాలని, మంజూరు కోరకు ప్రతిపాదనలను కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ గారికి పంపుటకుజిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి సూచించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking