ఓవర్ హెడ్ ట్యాంకుల పరిశీలన

ఓవర్ హెడ్ ట్యాంకుల పరిశీలన
మిర్యాలగూడ, జూలై 15 అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని ఆరో వార్డు ఇందిరమ్మ కాలనీ, హైదలపూర్ లో అమృత్ పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు.

అదేవిధంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ పొడి, తడి చెత్తా వేరు వేరుగా చేసి మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలలో వేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, నాయకులు ఎండి.ఇబ్రాహీం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న, ఎఇ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ కిరణ్, పర్యావరణ ఇంజనీర్ శ్వేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking