గంగదేవమ్మ గుట్ట ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి
*సబ్ కలెక్టర్ అమిత్ కు గ్రామస్తుల విన్నపం
మిర్యాలగూడ, జూలై 15 అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామ శివారులోని గంగమ్మ తల్లి గుట్టకు చెందిన భూమి సర్వే చేసి ఆక్రమించేందుకు కొంత మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి రాములు ఆధ్వర్యంలో గ్రామస్థులు మంగళవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ కు వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో 130 యాదవ కుటుంబాలు వంద సంవత్సరాలుగా పూర్వీకులు గంగమ్మ తల్లినీ ప్రతిష్టించుకుని గుట్టకు గంగదేవమ్మ గుట్టగా నామకరణం చేసుకుని 2 సంవత్సరాలకు ఒక సారి గంగమ్మ జాతర చేసుకుంటారని తెలిపారు. కొందరు వ్యక్తులు గుట్ట భూమిని ఆక్రమించేందుకు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని విచారణ జరిపి చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కె.రామకృష్ణ, బడుగుల లింగయ్య, ఎం.సైదులు, పీ.మల్లయ్య, సిహెచ్. శేఖర్, రవికాంత్, కేశయ్య, వెంకటయ్య, వీరయ్య,గంగయ్య, సయిదమ్మ, రాజు, ప్రభాకర్, పగడాల రామలింగయ్య, ఎల్లమ్మ తదితరులున్నారు.