పచ్చదనo పరిడవిల్లాలి

*వన మహోత్సవం – పచ్చదనపు పండుగ

నేరేడుచర్ల, అక్షిత ప్రతినిధి :

*లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు లయన్ గుండ్రెడ్డి సైదిరెడ్డి అధ్యక్షత ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా అధ్యక్షులు లయన్ గుండ్రెడ్డి సైదిరెడ్డి మాట్లాడుతూ – “పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మొక్కలు నాటటం ఒక చిన్న పని అయితే, దీని ఫలితం ఎంతో మహత్తరమైనది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణంగా భూగోళం వేడెక్కుతోంది. దీన్ని అరికట్టే మార్గం ఒక్కటే – అదే మొక్కలు నాటటం, చెట్లను సంరక్షించటం,” అని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ కొణతం సీతారాంరెడ్డి, బట్టు మధు, ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి* లయన్స్ క్లబ్ సభ్యులు బసవ కోటేశ్వరరావు, తక్కెళ్ళ నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ తీసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking