బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ
పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు చెల్లించాలి
లింగంగౌడ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
బీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ కాలేజీలో చదివే విద్యార్థుల ఫీజులు భారీగా పెంచారని గతంలో రూ.14,900 ఉన్న ఫీజును ఈసారి ఏకంగా రూ.39,000 వేలకు పెంచారని,బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించలేమని పెరిగిన ఫీజులను బీసీ విద్యార్థులే భరించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం అంటే ఫీజు రీయంబర్స్మెంట్ కు తూట్లు పొడవడమేనని అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తున్న ప్రభుత్వం బీసీ విద్యార్థుల విషయానికొచ్చేసరికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీల పక్షాన నిలబడి బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని లింగంగౌడ్ కోరారు