మధుర స్మృతులు

*ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

23 ఏళ్ల తర్వాత కలుసుకొని జ్ఞాపకాలు పంచుకున్న స్నేహితులు

గరిడేపల్లి,జూలై 20 అక్షిత న్యూస్ :

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కల్మల్ చెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.23 ఏళ్ల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.నేటి తమ స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని ఆనందంగా గడిపారు.ఎన్నో సంవత్సరాల తర్వాత తామందరం ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం తమకు విద్యాబుద్దులు నేర్పి నేడు సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి విద్యార్థులంతా వివిధ రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఆటపాటలతో సరదాగా గడిపారు.ఈ కార్యక్రమంలో నాటి అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking