ఉత్కృష్ట సేవా పథకం అవార్డు ఆర్డర్

*ఉత్కృష్ట సేవా పథకం అవార్డు ఆర్డర్ కాపీ అందుకున్న ఇన్స్పెక్టర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసి*

*18 ఏండ్లకే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నిరుపేద వ్యక్తి*

*ఎందరికో యువతకు స్ఫూర్తినిస్తున్న వైనం*

ఉమ్మడి నల్గొండ అక్షిత బ్యూరో :

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత పోలీసు సిబ్బందికి అందించే అతన్నత పురస్కారం లో భాగంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచ్చినందుకు గాను ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్న పేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన గంటెపాక నర్సింహా,ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సూర్యాపేట జిల్లా ఎస్పి కె నర్సింహా.చేతుల మీదుగా ఉత్కృష్ట సేవా పథకం అవార్డు ఆర్డర్ కాపీ అందుకున్నాడు. ఈ అవార్డు మెడల్ ను స్వతంత్ర దినోత్సవం 15th ఆగస్టు నా ప్రదానం చేయనున్నారు. ఇన్స్పెక్టర్ నర్సింహా మాట్లాడుతూ నేను పెద కుటుంబంలో జన్మించాను. మా అమ్మ నాన్నలు కూలీపని చేసేవారు నేను మా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు ఇంటర్ రామన్నపేట ప్రభుత్వ కళాశాల,డిగ్రి నిజాం కళాశాల హైదరాబాద్ లో చదివాను,చిన్నప్పటి నుండి పోలీస్ కావాలనే దృఢ సంకల్పం ఉండేది ఆ దిశగా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కానిస్టేబుల్ కి ఎంపికయ్యాను, 2012 లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యాను, ఇలా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాను,ఇదంతా నా యొక్క తల్లిదండ్రుల శ్రమ మరియు పోలీస్ ఉద్యోగం పై నాకున్న మక్కువతో సాధ్యమైంది అన్నారు వివిధ జిల్లాలో పనిచేస్తూ ప్రస్తుతం సూర్యాపేటలో ఇన్స్పెక్టర్ గా లో విధులు నిర్వహాస్తున్నాను,ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.అలాగే ఉద్యోగం చేస్తూనే చదువు మీద ప్రేమతో ఉస్మానియా యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎం ఏ ఇంగ్లీష్ పట్టా అందుకోవడం జరిగింది,యువత పట్టుదలతో చదివి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని. అలాగే పోలీస్ కావాలనే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఫీజికల్ ఈవెంట్స్ కి కోచింగ్ తో పాటు సొంత డబ్బులతో పోలీస్ కాంపిటిటివ్ స్టడీ మెటీరియల్స్ ఇచ్చాను, అందులో భాగంగా 28మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు ఎంపికై వివిధ ర్యాంకులలో పనిచేస్తున్నారు (3 ఎస్ ఐ లు 25 మంది కానిస్టేబుల్ లు) విరంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం ,అలాగే మా సొంత గ్రామంలో కూడా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు నా వంతుగా కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని అన్నారు,మునుముందు కూడా నేను పేద నిరుద్యోగులకు ఉచితంగా సేవా చేస్తూ వారి విజయానికి కృషి చేస్తానని తెలిపారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking