జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
నారాయణఖేడ్, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టులకు ఇంటినిర్మాణాల బిల్లు ఇవ్వాలని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి ఖేడ్ జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద గల ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ప్రభుత్వం 43 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. అప్పటి తహశీల్దార్ జర్నలిస్ట్ లకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు తీసుకున్న జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో కొందరు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. కొందరి ఇంటి నిర్మాణం పూర్తి కాగా మరి కొందరు ఇంటి నిర్మాణం కొనసాగుతుంది. అందుకోసం ఇంటి నిర్మాణాల కోసం బిల్లులు, అనుమతులు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో బిల్లులు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, మధుసూదన్ రెడ్డి, వి.పుండరీకం, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, చోటు, ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు.