*స్థానిక సంస్థల ఎన్నికల మండల కార్యశాల*
కొమురవెల్లి, అక్షిత న్యూస్:
కొమురవెల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు బూర్గోజు స్వరూప అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మండల కార్యాశాలకు ముఖ్యఅతిథిగా కొమురవెల్లి మండల వచ్చినప్రబారి తోకల ఉమారాణి మాట్లాడుతూ కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వార్డ్ మెంబర్ నుండి మొదలుకొని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల స్థానాలబరిలో సంఘటితంగా అందరూ కష్టపడి గెలుచుకోవాలన్నారు. జనగామ అసెంబ్లీ కన్వీనర్ దండాలలక్ష్మారెడ్డిమాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలితాలను ప్రతి కార్యకర్త నాయకులు ప్రజలకు తెలియజేయాలన్నారు.మండల అధ్యక్షురాలు బూర్గోజు స్వరూపమాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వం మహిళలకు రైతులకు యువకులకు చేస్తున్న సంక్షేమ ఫలాలను ఉచిత రేషన్ బియ్యం పంపిణీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా మండలంలోని నాయకులు కార్యకర్తలు కృషిచేసి ప్రజా ప్రతినిధులను గెలిపించి కొమురవెల్లి మండలంలో కాషాయ జెండా ఎగరవేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ అధ్యక్షులు కరక తిరుపతిరెడ్డి, మహిళా నాయకురాలు నక్కల స్వప్న రెడ్డి,బుడిగే బాలమణి, సీనియర్ నాయకులు గుర్రాల రాములు,వగలబోయిన నారాయణ గౌడ్,కొయ్యడ నవీన్ గౌడ్, బచ్చల నరసింహులు, పంజాల కనకయ్య, మండల ప్రధాన కార్యదర్శులు బొడుగం కృష్ణారెడ్డి,ఎక్కల్ దేవి శ్రీనివాస్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కనకయ్య, మండల ఉపాధ్యక్షులు జనగామ తిరుపతిగౌడ్, మద్దికుంట కరుణాకర్, ఈగ కనకయ్య మండల కార్యదర్శి మాట్ల కనకయ్య,కొంతం రాజు, మండల కోశాధికారి అక్కినపల్లి సంపత్ రెడ్డి, బూత్ అధ్యక్షులు చల్ల రమణారెడ్డి, శ్రీరాముల ప్రకాష్,కొట్టాల రవికుమార్,గంగులమల్లయ్య,యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నరేడ్ల నరేందర్ రెడ్డి,బచ్చల అశోక్, తూక్కోజి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.