సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
–గజ్వేల్ ఏసిపి నర్సింలు
దుబ్బాక అక్షిత ప్రతినిధి :
గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కు పాదం ఉక్కు పాదం మోపుతామని గజ్వేల్ ఏసిపి నర్సింలు స్పష్టం చేశారు.వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రికార్డులు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.
వర్టికల్ వారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని,రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు.విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలిఅంకితభావంతో విధులు నిర్వహించాలి.ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలని గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రజల ధనమాన ప్రాణరక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని సూచించారు. విపిఓ వ్యవస్థను మెరుగుపరచాలని వారంలో రెండు మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి అధికారులకు సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా పరిశోధన కొనసాగాలని తెలిపారు. కేడీలు డిసీలు సస్పెక్ట్ లు రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు, అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని తెలిపారు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రతిరోజు నిర్వహించాలన్నారు.
ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, సైబర్ నేరాలు, తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు, ఇసుక, పిడిఎస్ రైస్, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శించినప్పుడు గంజాయి ఇతర మత్తు పదార్థాలు బెట్టింగ్ సైబర్ నేరాల గురించి ప్రజలకు యువతి యువకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. విధినిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వర్షాకాలం అయినందున తప్పకుండా జర్కిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కృషి
ఈ కార్యక్రమంలో తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.