పారిశుధ్యం మెరుగుకు కృషి
కార్మికుల పనితీరుపై
ఆకస్మిక తనిఖీ
బైక్ పైనే రహదారుల పరిశీలన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సహాయకులు, మంది మార్బలం లేకుండా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ పై ఆదివారం పారిశుధ్య పనులు పరిశీలించారు. మిర్యాలగూడ పట్టణ సంపూర్ణ పారిశుధ్యం కోసం పట్టణంలోని ప్రధాన రహదారిపై పారిశుధ్య పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మున్సిపల్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పట్టణంలోని ప్రధాన రహదారులపై నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు.

ఎమ్మెల్యే బిఎల్ఆర్ బైక్ పై పట్టణంలోని పలుచోట్ల సందర్శించి పనులను పర్యవేక్షించి పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. వర్షాకాలం అపరిశుభ్రత వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు మరింత వేగంగా మెరుగ్గా నిర్వహించాలని ఆయన కోరారు. వీధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆయన కోరారు.