నిండుకుండలా సాగరo

నిండుకుండలా సాగర్ జలాశయం 

22 రోజుల్లో 161 టీఎంసీల నీటి రాక….

నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వరద నీటి కారణంగా ఎన్నడూ లేనంతగా జులై నెలలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గత సంవత్సరం ఆగస్టులో క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు భారీ వరద నీటి కారణంగా ఈ నెలాఖరులోనే క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత 22 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 161 టీఎంసీలు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. కాగా ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సాగునీటి విడుదల తో పాటు జల విద్యుదుత్పత్తి కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. కాగా మొత్తం 33 వేల 719 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లో గా విడుదల చేస్తున్నారు. రోజుకు సుమారు ఎనిమిది టిఎంసిల నీరు వస్తుండడంతో మూడు టీఎంసీలపైగా సాగు, తాగు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా ఉపయోగిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చరిత్రలో గత ఆరు సంవత్సరాలుగా ప్రాజెక్టు ప్రతి ఏటా గరిష్ట స్థాయి నీటిమట్టాలకు చేరుకోవడం రైతులకు శుభసూచకంగా మారింది. అంతేకాకుండా విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో చేస్తుడడంతో కొరతను అధికమిస్తున్నారు.

*మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల ఎత్తివేత..?*

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తయారు కావడంతో మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో పర్యాటకుల రాక ప్రారంభం కానుంది. ప్రతి ఏటా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలో కృష్ణమ్మ అందాలను చూసేందుకు హైదరాబాద్ తో పాటు రెండు రాష్ట్రాల నుండి పర్యాటకులు అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉందని పర్యటక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి రమనీయ అందాలను వీక్షించేందుకు సాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు రెండు సీజన్లకు సాగునీరు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking