యూరియా కొరత తలెతొద్దు

యూరియా కొరత తలెతొద్దు

*ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రైతులకు యూరియా కొరత తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ లో రెండవ వారం బుధవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎం.నారాయణ్ అమిత్ పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ పాల్గొన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కొరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు చేరుకొని ఫిర్యాదులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గత ప్రభుత్వాల కంటే ముందుగానే సాగునీటిని విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ఎరువుల కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్ చేయకుండా, ధరలు పెంచ, దుకాణదారులు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా నిరంతరం సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. తమ సమస్య ఏదైనప్పటికీ ప్రజావాణి కార్యక్రమం వద్ద ప్రత్యేక అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమస్య చెప్తే దరఖాస్తులు వారే నింపి 15 రోజుల్లో సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు కృషి చేస్తారన్నారు.కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల్లో కూడా జవాబుదారితనం పెరిగి సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామని ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ కె.రాజశేఖర్ రాజు, ఆర్టీసీ నల్లగొండ రీజనల్ మేనేజర్ కె.జానారెడ్డి, రెవిన్యూ డివిజన్ పరిపాలన అధికారి శ్రీనివాస్ శర్మ, వ్యవసాయ శాఖ ఇంచార్జి ఎడిఎ డి. సైదానాయక్, ఎంవిఐ ఎల్.వీరస్వామి, ఆర్టిసి డిఎం రామ్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ ఎం.శేషగిరిశర్మ, మిర్యాలగూడ వేములపల్లి, మాడ్గులపల్లి తహశీల్దార్లు సురేష్ కుమార్, పావని సరోజ, పుష్పలత, ఎంఇఓ ఎల్.బాలునాయక్, మున్సిపల్ మేనేజర్ జి.జ్ఞానేశ్వరి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, నాయకులు షేక్ అబ్దుల్లా, ఎన్ఎస్ ఐయు జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఆరిఫ్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking