తిరుమలయ్య గుట్టను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారుద్దాం: ఐక్యవేదిక పిలుపు

  • తిరుమలయ్య గుట్టను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారుద్దాం: ఐక్యవేదిక పిలుపు
    బట్ట బ్యాగులే ముద్దు అంటూ తిరుమలనాథుని దర్శించిన సభ్యులు

వనపర్తి, అక్షిత ప్రతినిధి: శ్రావణమాస రెండవ శనివారం సందర్భంగా వనపర్తి ఇలవేలుపూ తిరుమలయ్య గుట్టపై తిరుమలనాథ స్వామిని దర్శించుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మరియు బృందం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై ప్రజలకు సందేశం ఇచ్చారు. నిస్వార్థ ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు “ప్లాస్టిక్ వద్దు – బట్ట బ్యాగులే ముద్దు” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుట్టపై తిరుమల స్వామిని దర్శించిన సతీష్ యాదవ్‌కు ఆలయ పూజారులు స్వాగతం పలికి పూజలు నిర్వహించి దీవెనలు అందించారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, సమాజం నుంచి అవినీతి నిర్మూలన కావాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అవినీతిపరులను ఓడించాలన్న తమ లక్ష్యానికి ప్రజాశక్తి తోడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్, గౌని కాడి యాదయ్య, నక్క కృష్ణ యాదవ్,నాగరాజు, రామస్వామి, శ్రీను, నిస్వార్థ ఫౌండేషన్ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking