18వ వీరశైవ లింగాయత్ సమాజం పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి: విశ్వశాంతి కోసం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 18వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 12వ శతాబ్దంలో అభ్యుదయ సమాజం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. 18 సంవత్సరాలుగా ఏకధాటిగా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, సమాజం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
