పూర్వ స్నేహితుల అపూర్వ కలయిక

  • హుస్నాబాద్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్, అక్షిత ప్రతినిధి: హుస్నాబాద్ పట్టణంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఆదివారము 87-88 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం నాడు ఘనంగా ఆనందంగా ఆహ్లాదంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు మా స్నేహితులందరము కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని. గత 15 సంవత్సరం నుండి మా బడి సోపతి అందరం కలిసి వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరము స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వారు తెలిపారు. మేము అందరం స్నేహితుల సంబంధించిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని ఎన్నడు విడిపోవద్దని స్నేహబంధం కంటే ఏ బంధం గొప్పది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి మహేందర్, ఏఎంసి మాజీ డైరెక్టర్లు అయిత శ్రీధర్, వడ్డేపల్లి వెంకటరమణ, సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ , బూట్ల శ్రీనివాస్, మరియు మిత్రులు ఆదర్శ మాజీ రైతులు గుర్రాల సంజీవరెడ్డి, రెక్కల రాజిరెడ్డి. ప్రముఖ వ్యాపారవేత్త బండారి రామనారాయణ.జెట్టి వెంకట్ స్వామి.చొక్కాచారి శ్రీనివాసరావు, తోపాటు మిత్రులందరూ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking