- బోనాల పండుగలు మహిళా శక్తిని చాటిచెప్పే ఆధ్యాత్మిక ఉత్సవాలు – సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా.
కొత్తగూడెం, అక్షిత న్యూస్: తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగలలో బోనాలు ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నాయని, ఈ ఉత్సవాలు మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిక చిహ్నాలుగా నిలుస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు.
ఆదివారం పట్టణంలోని రైతుబజార్ వద్ద వ్యాపారుల కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల జాతరలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
స్త్రీల పూజ – తెలంగాణ సంస్కృతిలో అధ్బుతమైన సంప్రదాయం
ఈ సందర్భంగా మాట్లాడిన సాబీర్ పాషా మాట్లాడుతూ, “తెలంగాణలో స్త్రీలకు ఉన్న గౌరవం, ఆరాధన అనాదిగా వస్తున్న అంశాలు. మన సంస్కృతిలో మహిళలను పూజించే సాంప్రదాయం ఉన్నతంగా నిలిచిందని ఇది మన రాష్ట్రం ప్రత్యేకత” అన్నారు.
అంతేగాక, ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ సంస్కృతిక ఉద్యమం ఎంతగానో ప్రభావం చూపిందని గుర్తుచేశారు. ఈ సంస్కృతి, సంప్రదాయాలను నేటితరానికి అందించడంలో ఇలాంటి ఉత్సవాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని అన్నారు. ఈ ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి. రాగద్వేషాలు, సామాజిక భేదాలను దూరం చేస్తాయి. సమాజంలో శాంతిని స్థాపించేందుకు ఇవి ఎంతో దోహదపడతాయి అని సాబీర్ పాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రాము, మదన్ లాల్, వేణు, పద్మ, కుమారి, తులసి తదితరులు పాల్గొన్నారు.