- ఆర్యవైశ్యులు ఆదినుండి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే ప్రాణదాతలు
- ఆర్యవైశ్యమండల అధ్యక్షులు మంచినీళ్ల మహేందర్
నాగారం, అక్షిత న్యూస్: ఆర్యవైశ్యులు ఆది నుండి నేటి వరకు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే ప్రాణదాతలని నాగారం మండల ఆర్యవైశ్య మండల అధ్యక్షులు మంచినీళ్ల మహేందర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి ఆర్యవైశ్య హక్కుల సాధనకై పోరాటానికి బయలుచేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఆగస్టు 3 న వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఆర్యవైశ్య రాజకీయ రణభేరికి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపుమేరకు ఆర్యవైశ్యుల హక్కుల సాధనకై నేడు ఆగస్టు 3 న హైదరాబాదులో జరగనున్న వైశ్య రాజకీయ రణభేరి కోసం నాగారం మండల కేంద్రంలో ఆర్యవైశ్యల హక్కుల సాధనకై పోరాటానికి బయలుదేరడం జరిగిందని అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బుక్క శ్రీనివాస్, కార్యదర్శి గజ్జం శివాజీ, శ్రీ మూర్తి , శివప్రసాద్, శంకర్, నాగయ్య, యాదగిరి రమేష్, వెంకన్న, శ్రీనివాస్ శ్రీరంగం, యాదగిరి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.