కొత్తగూడెం, అక్షిత న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలోని స్టేడియం గ్రౌండ్ ఎదురుగా ఉన్న పి.ఆర్. ఫంక్షన్ హాల్‌లో 2001-2002 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వివిధ రంగాల్లో ప్రాధాన్యంగా స్థిరపడిన ఈ బ్యాచ్ విద్యార్థులు పోలీసులు, ఉపాధ్యాయులు, బ్యాంక్ మేనేజర్లు, డాక్టర్లు, సింగరేణి అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఫోటోగ్రాఫర్లు, లిరిక్ రైటర్లు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము స్నేహితులుగా మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
“స్నేహం అంటే జీవితాంతం నిలిచే బంధం”
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. “స్నేహితులు కేవలం స్కూల్ రోజుల్లో కలిసి చదువుకున్నవాళ్లు మాత్రమే కాదు, జీవితాంతం ఎప్పుడు ఆపద్భాంధవులై ఉండే వారు. మీ స్నేహం చిరకాలం కొనసాగాలి. మీరు నేటి పిల్లలకు మంచి మార్గదర్శకులుగా నిలవాలి,” అని కోరారు. ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులకు విద్యార్థులు ప్రత్యేక సన్మానం చేశారు. అనంతరం భోజన కార్యక్రమం, అభిప్రాయాల పంచుకోవడం, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ఆహ్లాదకరంగా గడిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జగన్, టీచర్ కత్తుల సతీష్, డాక్టర్ సతీష్, టీమ్ లీడర్ గుంపుల శ్రీనివాస్, దేవేందర్, ఏలూరి రాజేష్ కుమార్, వాడపల్లి రమేష్ బాబు, సందీప్, జోగి వెంకటేశ్వర్లు, శంకర్, అన్వర్, హైమద్, ముత్యాల రమేష్, రాజేశ్వరరావు, సాగర్ బాబు, గారే శ్రీనివాస్, కృష్ణ, రఘు, చెవుల బాలకృష్ణ, స్వర్ణలత, కవిత, మల్లీశ్వరి, బిపాషా తదితరులు పాల్గొన్నారు.