నమ్మకానికి మారు పేరు సుందరం హెూమ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమ్మకానికి మారు పేరు సుందరం హెూమ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఖమ్మంలో హెూమ్ లోన్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

ఖమ్మం /అక్షిత బ్యూరో :

వినియోగదారుల నమ్మకానికి మారు పేరుగా సుందరం హెూమ్ ఫైనాన్స్ సంస్థలు నిలిచాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్రాంచ్ లు కొనసాగుతున్నాయి. సుందరం హోమ్ లోన్స్ కు సంబంధించి ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు కటకం హెూండా షోరూం పైన కొత్త ప్రాంగణంలో పునరుద్ధరించబడిన శాఖను బుధవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభించారు. నేషనల్ బిజినెస్ హెడ్ జి అనందన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏరియా హెద్ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి,l తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ మల్లేష్ ఖమ్మం క్లస్టర్ హెడ్ మంగళగిరి నాగ రవి ప్రసాద్ బ్రాంచ్ మేనేజర్ షేక్ మౌలాలి ఛానల్ రిలేషన్ షిప్ ఏజీ ఏం శ్యామ్ చంద్రన్ ప్రాజెక్ట్ అండ్ ఛానల్ బిలేషన్షిప్ జిఎం కుపురేష్ బాల సుబ్రహ్మణ్యం ఏజీఎం శివానంద కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో వక్తలు మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సత్వర రుణ మంజూరి పంపిణీ చేస్తామన్నారు. చత్రాల భద్రత కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రుణ నిబంధనలు తెలియజేయడంలో ఎటువంటి అస్పష్టత ఉండదని తెలిపారు, గృహ, స్థల, బదలాయింపు, ఇంటి విస్తరణ, గృహ మెరుగుదల రుణాలు, అదనపు రుణం (టాప్ అప్), ఫిక్స్ డిపాజిట్లు అందజేస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిన్సి, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమ సంస్థలు విస్తరించాయని వారు వివరించారు. ఖమ్మం బ్రాంచ్ మెదుగైన స్థానంలో ఉందని 600 మంది కస్టమర్లతో 200 కోట్ల రూపాయల టర్నోవర్ తో నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఇంకా 100 కోట్ల రూపాయల లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు ఇక్కడ సుందరం ఫైనాన్స్ కు సంబంధించి 2,500 మంది కస్టమర్లతో నేవలందిస్తున్నామని తెలిపారు. సుందరం హెూమ్ లోన్ అను గ్రహ పథకం కింద అల్పదాయక వర్గ ప్రజలకు గృహ రుణాలు అందజేస్తామన్నారు. రూ.7,000 నెలసరి ఆదాయం వచ్చే ప్రతి ఒక్కరికి తమ సంస్థ రుణాల అందజేస్తుందన్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించి 99% మందికి రుణాలు అందజేసేందుకు సుందరం ఫైనాన్స్ చేయూతనందిస్తుందన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 18004197722 కు ఫోన్ చేయాలని కోరారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో సుందరం ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులు, వినియోదారులు రుణ ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking